అమెరికా జనాభా లెక్కల్లో హెచ్-1బీ భారతీయులకు భారీ షాక్ తప్పదా?
రిపోర్టర్: ప్రవీణ్
స్థలం: అమెరికా
అమెరికాలో 2030లో జరిగే జనగణనలో పౌరులు, గ్రీన్కార్డుదారులను మాత్రమే లెక్కించేలా ట్రంప్ ప్రభుత్వం ప్రతిపాదన తెచ్చింది. దీనివల్ల H-1B, F-1 వీసాలపై ఉన్న భారతీయులు జనాభా లెక్కల నుంచి మినహాయించబడే ప్రమాదం ఉంది. ఈ నిర్ణయం అమలైతే ఆయా ప్రాంతాల రాజకీయ ప్రాతినిధ్యం, ఫెడరల్ నిధుల కేటాయింపులపై తీవ్ర ప్రభావం పడనుంది. దీనిపై పౌరహక్కుల సంఘాలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.