దివంగత నటుడు రాబిన్ విలియమ్స్ పై ఏఐ వీడియోలపై కూతురు జెల్డా విలియమ్స్ ఆగ్రహం
రిపోర్టర్: అశోక్
స్థలం: World
దివంగత ప్రసిద్ధ హాలీవుడ్ నటుడు రాబిన్ విలియమ్స్ పై ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగించి రూపొందించిన ఫేక్ వీడియోలు వైరల్ కావడంపై ఆయన కుమార్తె, నటి దర్శకురాలు జెల్డా విలియమ్స్ తీవ్రంగా మండిపడ్డారు. తన తండ్రి ఇష్టానికి వ్యతిరేకంగా ఏఐతో ఆయన గొంతును, రూపాలను వాడుతూ తప్పుడు ప్రచారం చేయడం పట్ల ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. మరణించిన వ్యక్తులను ఇలా పపెట్లుగా మార్చడం సిగ్గుచేటని, ఏఐ సాంకేతికత ద్వారా నటుల సమ్మతి లేకుండా వారిని అనుకరించడాన్ని తాను ఎప్పుడూ వ్యతిరేకిస్తానని స్పష్టం చేశారు.