కొత్తవలసలో ప్రభుత్వ భూముల కబ్జా: అక్రమార్కుల చెరలో వేల ఎకరాలు
రిపోర్టర్: వెంకట్
స్థలం: విజయనగరం
విజయనగరం జిల్లా కొత్తవలస మండలంలో అభివృద్ధి వేగవంతం కావడంతో ప్రభుత్వ భూములపై అక్రమార్కుల కన్ను పడింది. విశాఖ మరియు విజయనగరానికి మధ్య కీలక ప్రాంతంగా మారిన కొత్తవలసలో భూముల ధరలు అమాంతం పెరిగిపోవడంతో, కోట్ల విలువైన ప్రభుత్వ భూములు అన్యాక్రాంతమవుతున్నాయి. గిరిజన విశ్వవిద్యాలయం, గ్రేహౌండ్స్ శిక్షణ కేంద్రం వంటి సంస్థల రాకతో ఇక్కడ భూముల డిమాండ్ విపరీతంగా పెరిగింది.