భారీ వర్షాల బీభత్సం: మచిలీపట్నంలో నీటమునిగిన ప్రధాన వీధులు

రిపోర్టర్: శివ స్థలం: మచిలీపట్నం

అండమాన్ సముద్రంపై ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో ఏపీలోని కోస్తాంధ్రలో వర్షాలు కురుస్తున్నాయని, కృష్ణాజిల్లా మచిలీపట్నంలో మధ్యాహ్నం నుంచి ఎడతెరిపి లేకుండా కురిసిన భారీ వర్షానికి ప్రధాన వీధులు జలమయమయ్యాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. మెయిన్ రోడ్డుపై మోకాలిలోతు నీరు నిలిచిపోవడంతో పార్క్ చేసిన బైకులు నీటమునిగాయని, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు.