సూళ్లూరుపేటలో పేదల కోసం టిడ్కో గృహాల ప్రారంభోత్సవం
రిపోర్టర్: Darla Venkateswarlu
స్థలం: సూళ్లూరుపేట
సూళ్లూరుపేటలో పేదల చిరకాల స్వప్నం నెరవేరింది. పట్టణంలో నిర్మించిన టిడ్కో గృహాలను గురువారం ఎమ్మెల్యే డాక్టర్ నెలవల విజయశ్రీ ఘనంగా ప్రారంభించారు. లబ్ధిదారులకు స్వయంగా తాళం చెవులు అందజేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక యుద్ధ ప్రాతిపదికన పనులు పూర్తి చేసి పేదలకు ఇళ్లను అందిస్తున్నట్లు ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు స్థానిక నాయకులు, అధికారులు, లబ్ధిదారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.