భారీ ఊరట: అంతర్జాతీయ మార్కెట్ లో ఒక్కసారిగా పడిపోయిన ముడి చమురు ధరలు
రిపోర్టర్: కిరణ్
స్థలం: టెహ్రాన్
అంతర్జాతీయ మార్కెట్ లో ముడి చమురు ధరలు ఒక శాతానికి పైగా తగ్గాయని కేసీఎం ట్రేడ్ చీఫ్ మార్కెట్ అనలిస్ట్ టిమ్ వాటర్ర్ తెలిపారు. ఇరాన్, ఖతార్ అధికారుల మధ్య జరుగుతున్న దౌత్య చర్చల నేపథ్యంలో సరఫరా అంతరాలపై ఆందోళనలు కొంతవరకు తగ్గాయని ఆయన పేర్కొన్నారు. బ్రెంట్ క్రూడ్ ఫ్యూచర్స్ బ్యారెల్ కు 111.84 డాలర్లకు పడిపోగా, డబ్ల్యూటీఐ క్రూడ్ 102.56 డాలర్లకు చేరిందని మార్కెట్ నిపుణులు వెల్లడించారు.