తెల్లకాగితం మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్: ప్రభాస్ సపోర్ట్తో భారీ ధైర్యం వచ్చింది

రిపోర్టర్: హరి స్థలం: హైదరాబాద్

సినిమా విడుదలకు ముందు మా చిత్రం నుంచి ఒక వీడియో లీక్ కావడం షాక్ గురిచేసిందని, అయితే పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ట్రైలర్ పోస్ట్ చేసి మాకు కొండంత ధైర్యం ఇచ్చారని హీరో హర్ష్ రోషన్ తెలిపారు. హైదరాబాద్లో జరిగిన తెల్లకాగితం ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఆయన మాట్లాడారు. అక్టోబర్ 2న థియేటర్లలో పూర్తి సినిమా చూశాక మీ ఆలోచన మారుతుందని రోషన్ స్పష్టం చేశారు.