వైట్ రైస్ కు బదులు రాగి తింటే షుగర్ అదుపులోకి వస్తుందా: ప్రముఖ వైద్యుడు డాక్టర్ వి మోహన్ కీలక వెల్లడి
రిపోర్టర్: కృష్ణ
స్థలం: Hyderabad
తెలుపు బియ్యానికి బదులుగా రాగులు తింటే రక్తంలో చక్కెర స్థాయిలు వాటంతట అవే తగ్గుతాయని అనుకోవడం పొరపాటని, బియ్యం, గోధుమలు, రాగులు అన్నీ కార్బోహైడ్రేట్లేనని ప్రముఖ డయాబెటాలజిస్ట్ డాక్టర్ వి మోహన్ స్పష్టం చేశారు. కేవలం ధాన్యం మార్చడం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదని, భోజనంలో ప్లేట్ నిండా కూరగాయలు, తగినపాళ్లలో ప్రొటీన్లు ఉండేలా చూసుకోవడం ద్వారానే మధుమేహాన్ని సమర్థంగా నియంత్రించవచ్చని ఆయన తెలిపారు.