కొతుల బెడద తీవ్రం: శాశ్వత పరిష్కారం చూపాలని ధన్బాద్ ఉప సర్పంచ్ విజ్ఞప్తి
రిపోర్టర్: శివ
స్థలం: భద్రాద్రి కొత్తగూడెం
ధన్బాద్ ఉప సర్పంచ్ భూక్యా ప్రేమ్ కుమార్ సోమవారం ప్రజావాణిలో జిల్లా సబ్ కలెక్టర్ మరియు డీపీఓలకు వినతిపత్రం అందజేశారు. కొత్తగూడెం ఏరియా పరిధిలో కోతుల దాడులు పెరిగిపోతున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అభివృద్ధి పనుల వల్ల అడవులు కనుమరుగై కోతులు జనావాసాలపై పడుతున్నాయని వివరించారు. సింగరేణి సంస్థ కోతులను దత్తత తీసుకుని పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేయాలని, ప్రజల భద్రతకు శాశ్వత చర్యలు చేపట్టాలని ఆయన కోరారు.