కాంగ్రెస్ సర్కార్ మోసాలపై మండిపడ్డ బీజేపీ నేత లక్ష్మీకాంత్ రెడ్డి

రిపోర్టర్: భాస్కర్ స్థలం: నర్వ

నర్వ మండల కేంద్రంలో నిర్వహించిన పట్టభద్రుల సన్నాహక సమావేశంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు బంగ్లా లక్ష్మీకాంత్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో రేవంత్ రెడ్డి సర్కార్ పూర్తిగా విఫలమైందని ఆయన మండిపడ్డారు. పింఛన్లు, రైతు భరోసా హామీలపై మోసం చేస్తూ ప్రజలను దగా చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాబోయే ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులను గెలిపించాలని ఆయన పిలుపునిచ్చారు.