అన్నగా భావించి రాఖీ కట్టిన యువకుడినే ప్రేమ వివాహం చేసుకున్న యువతి
రిపోర్టర్: రాము
స్థలం: ప్రయాగ్రాజ్
అన్నగా భావించి పదిహేనేళ్లుగా రాఖీ కట్టిన యువకుడినే యువతి ప్రేమ వివాహం చేసుకున్న విచిత్ర ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ప్రయాగ్రాజ్ జిల్లాలో చోటుచేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఇరవై ఏళ్ల నందనీ పాండే గతంలో తన అన్నగా భావించిన ఇరవై రెండు ఏళ్ల శాశ్వత్ గుప్తాను రహస్యంగా పెళ్లి చేసుకుంది. కూతురు తమను మోసం చేసిందని ఆగ్రహం వ్యక్తం చేసిన కుటుంబ సభ్యులు, ఆమె చనిపోయిందంటూ ప్రతీకాత్మకంగా కర్మకాండలు నిర్వహించారు. ఈ వివాహంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.