ఏలూరులో పోగొట్టుకున్న 206 మొబైల్స్ రికవరీ చేసిన పోలీసులు

రిపోర్టర్: ప్రవీణ్ స్థలం: Eluru, Andhra Pradesh

ఏలూరు జిల్లా పోలీసులు అద్భుతమైన పనితీరు కనబరిచారు. ఆగస్టు నెలలో పోగొట్టుకున్న 206 మొబైల్ ఫోన్లను ట్రేస్ చేసి బాధితులకు అందజేశారు. ఇప్పటివరకు మొత్తం 4,266 ఫోన్లను (రూ. 10.66 కోట్ల విలువైనవి) పోలీసులు రికవరీ చేశారు. మొబైల్ పోగొట్టుకున్న వారు వెంటనే CEIR పోర్టల్‌లో ఫిర్యాదు చేయాలని పోలీసులు సూచిస్తున్నారు. బాధితులు పోలీసుల సేవలను అభినందిస్తూ కృతజ్ఞతలు తెలిపారు.