కెమికల్ డ్రమ్ములను బహిరంగ ప్రదేశంలో నిల్వ చేస్తున్న యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలి

రిపోర్టర్: santhoshkumar స్థలం: గాజువాక

పరవాడ. ఫార్మసిటీలో ఖాళీ స్థలంలో ఆరుబయట నిబంధనలకు విరుద్ధంగా కెమికల్ డ్రమ్ములను నిల్వచేసిన యాజమాన్యంపై వెంటనే చర్యలు తీసుకోవాలని ఫార్మాసిటీ స్టాప్ అండ్ వర్కర్స్ యూనియన్ సిఐటియు గౌరవ అధ్యక్షులు గని శెట్టి సత్యనారాయణ డిమాండ్ చేశారు. ఆదివారం వర్షం పడటంతో కెమికల్ డ్రమ్ముల నుండి భారీ ఎత్తున ప్రమాదకరమైన విషవాయువులు విడుదల కావడం పట్ల గని శెట్టి ఆగ్రహ వ్యక్తం చేశారు. యాజమాన్యంపై పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులు చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. తాడి గ్రామానికి సమీపంలో ఉండడంతో గ్రామం మొత్తం పొగతో నిండిపోయిందని వెంటనే చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. దీనిపై జిల్లా కలెక్టర్ కి ఫిర్యాదు చేస్తున్నట్లు గని శెట్టి తెలిపారు