అన్న క్యాంటీన్ల పునరుద్ధరణ: పేదల ఆకలి తీరుస్తున్న కూటమి ప్రభుత్వం

రిపోర్టర్: ప్రవీణ్ స్థలం: నెల్లూరు

గత వైకాపా ప్రభుత్వం మూసివేసిన అన్న క్యాంటీన్లను కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే పునరుద్ధరించి నిరుపేదల ఆకలి తీరుస్తోందని అధికారులు తెలిపారు. నెల్లూరు జిల్లాలో రూ.61 లక్షలతో మౌలిక వసతులు కల్పించి క్యాంటీన్లను అందుబాటులోకి తెచ్చామన్నారు. కేవలం ఐదు రూపాయలకే రుచికరమైన భోజనం అందిస్తుండటంతో ఆటోడ్రైవర్లు, హమాలీలు, చిరుద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. గత ఐదేళ్లుగా పడిన ఇబ్బందులు తొలగిపోయాయని, ప్రస్తుతం మూడు పూటలా కడుపు నిండా ఆహారం దక్కుతోందని లబ్ధిదారులు ఆనందం వెలిబుచ్చారు.