బ్యాంక్ ఉద్యోగులకు గుడ్ న్యూస్: వారానికి ఐదు రోజుల పని విధానం అమలు చేయాలని కవిత డిమాండ్
రిపోర్టర్: వెంకట్
స్థలం: హైదరాబాద్
బ్యాంకు ఉద్యోగుల న్యాయబద్ధమైన డిమాండ్‌పై కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించి వారానికి ఐదు రోజుల పని విధానాన్ని వెంటనే అమలు చేయాలని తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. ఈ మేరకు మంగళవారం ఓ వీడియో విడుదల చేసిన ఆమె, అధిక పనిభారంతో సతమతమవుతున్న ఉద్యోగులకు ఈ నిర్ణయం ఎంతో ఊరటనిస్తుందని స్పష్టం చేశారు. డిజిటల్ లావాదేవీలు పెరిగినప్పటికీ సిబ్బందిపై ఒత్తిడి తగ్గలేదన్నారు.