కోస్గిలో తెలంగాణ రక్షణ సేన పాంచ జన్య సంకల్ప సభ
రిపోర్టర్: కృష్ణ
స్థలం: నారాయణపేట
నారాయణపేట జిల్లా కొడంగల్ నియోజకవర్గంలోని కోస్గి పట్టణంలో ఆదివారం తెలంగాణ రక్షణ సేన పార్టీ ఆధ్వర్యంలో పాంచ జన్య సంకల్ప సభ నిర్వహించనున్నట్లు ఆ పార్టీ జిల్లా అధ్యక్షులు గవినొళ్ల శ్రీనివాస్ తెలిపారు. కోస్గి జూనియర్ కళాశాల మైదానంలో మధ్యాహ్నం 2 గంటలకు జరగనున్న ఈ బహిరంగ సభకు పార్టీ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ముఖ్య అతిథిగా హాజరై ఉచిత విద్య, వైద్యం, రైతు సంక్షేమం, నిరుద్యోగ ఉపాధి వంటి అంశాలపై దిశానిర్దేశం చేస్తారని పేర్కొంటూ, పార్టీ శ్రేణులు, ప్రజలు భారీగా తరలివచ్చి సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.