మహిళా శిశు సంక్షేమ శాఖలో కాంట్రాక్టర్ల చక్రం అరాచకాలు

రిపోర్టర్: రమేష్ స్థలం: తెలంగాణ

తెలంగాణలోని మహిళా శిశు సంక్షేమ శాఖలో కొందరు కాంట్రాక్టర్ల జోక్యం విపరీతంగా పెరిగిపోయిందని తీవ్ర ఆరోపణలు వస్తున్నాయి. టెండర్లు, పోస్టింగ్‌ల ఫైళ్ల కదలికల్లో జోక్యం చేసుకుంటూ అధికారులను బెదిరిస్తూ డబ్బులు డిమాండ్ చేస్తున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యమంత్రికి సన్నిహితులమంటూ బెదిరింపులకు పాల్పడుతున్న ఈ బృందం తీరుపై శాఖ సిబ్బంది తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ మంత్రికి ఫిర్యాదు చేసేందుకు సిద్ధమవుతున్నారు.