తీహార్ జైలులో సీజేపీ నేతలు: అభిజీత్ దీప్కే సోషల్ మీడియా పోస్ట్ వైరల్
రిపోర్టర్: సురేష్
స్థలం: న్యూఢిల్లీ
తీహార్ జైలులో రిమాండ్లో ఉన్న తమ సహచర నాయకుల విడుదల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నానని కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే పేర్కొన్నట్లు తెలిపారు. ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద అనుమతి లేకుండా నిరసనలు చేపట్టిన ఆరోపణలతో సీజేపీ కీలక నేతలు సౌరవ్ దాస్, ఆశుతోష్ రాంకాలకు కోర్టు జ్యుడీషియల్ కస్టడీ విధించింది. ఈ నేపథ్యంలో వారి భద్రత నిమిత్తం ప్రత్యేక సెల్స్లో ఉంచి సీసీటీవీ కెమెరాలతో నిరంతరం పర్యవేక్షిస్తున్నట్లు తీహార్ జైలు అధికారులు స్పష్టం చేశారు.