రష్యాలో షాకింగ్ ఘటన: ల్యాబ్ టెక్నీషియన్ దుర్మరణంతో తీవ్ర కలకలం

రిపోర్టర్: రమేష్ స్థలం: Irkutsk

ఇర్కుట్స్క్ యాంటీ ప్లేగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో ల్యాబ్ టెక్నీషియన్గా పనిచేస్తున్న ఇరవై ఎనిమిదేళ్ల దర్యా షిపిలోవా అనుమానాస్పద స్థితిలో మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. ఈ ఘటనతో రష్యాలోని ఆ ప్రాంతంలో తీవ్ర కలకలం రేగింది. ఆమెతో కాంటాక్ట్ అయిన దాదాపు రెండు వందల మందిని వైద్యుల పర్యవేక్షణలో ఉంచారు. అయితే ఇది ప్లేగ్ వ్యాధి కాదని, అంతుచిక్కని తీవ్రమైన నిమోనియా అని రష్యా ఆరోగ్య సంస్థ స్పష్టం చేసింది.