అనారోగ్యంతో బాధపడుతున్న వీరాభిమానికి హీరో రామ్ పోతినేని సాయం

రిపోర్టర్: నరేష్ స్థలం: తూర్పు గోదావరి

అరుదైన జన్యుపరమైన వ్యాధితో బాధపడుతున్న తన వీరాభిమాని శశి భవ్యత వైద్య ఖర్చులు, మందుల బాధ్యతను హీరో రామ్ పోతినేని భరించారు. తూర్పుగోదావరి జిల్లాకు చెందిన ఆ యువతి కుటుంబానికి వీడియో కాల్ ద్వారా ధైర్యం చెప్పిన రామ్, చికిత్సకు అవసరమైన సామగ్రిని స్వయంగా పంపించి తన ఉదారతను చాటుకున్నారు.