ట్రాఫిక్‌లో హారన్ల మోతపై నెట్టింట చర్చ లేవనెత్తిన డచ్ మహిళ
రిపోర్టర్: శివ
స్థలం: Hyderabad
భారతదేశంలో ట్రాఫిక్‌లో విపరీతంగా హారన్లు కొట్టడం వెనుక ప్రత్యేకమైన సాంస్కృతిక నేపథ్యం ఉందని ఇవానా అనే డచ్ మహిళ పేర్కొన్నారు. భారత్ వెనుకబడిన దేశమని కొందరు విమర్శించడాన్ని ఆమె తప్పుపట్టారు. హారన్ కొట్టడం అనేది కేవలం శబ్దం కాదని, అది రోడ్డుపై డ్రైవర్ల మధ్య ఒక కమ్యూనికేషన్ సాధనమని ఇన్స్టాగ్రామ్ వీడియో ద్వారా ఆమె స్పష్టం చేశారు. ఈ అంశంపై సోషల్ మీడియాలో ప్రస్తుతం తీవ్ర చర్చ జరుగుతోంది.