ఎలాన్ మస్క్ కంటే ముందే భారత్ లో ఎగిరే కార్లు: రణ్బీర్ కపూర్ సంచలనం
రిపోర్టర్: రమేష్
స్థలం: హైదరాబాద్
ఎలాన్ మస్క్ ఎగిరే కారును ఇటీవల కనిపెడితే, వేల ఏళ్ల క్రితమే భారతదేశం దానిని సాధించిందని రామాయణం చిత్రంలో రాముడి పాత్ర పోషిస్తున్న ప్రముఖ నటుడు రణ్బీర్ కపూర్ పేర్కొన్నారు. సుమ యాంకర్ గా వ్యవహరించిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, రామాయణ కాలంలోనే పుష్పక విమానం వంటి సాంకేతికత ఉండేదని, ఆనాడు జరిగిన ప్రతి సంఘటన వెనుక బలమైన శాస్త్రీయత దాగి ఉందని దర్శకుడు నితీశ్ తివారీ కూడా స్పష్టం చేశారు.