తిరుపతిలో ఈగల్ ఆధ్వర్యంలో మాదకద్రవ్యాలపై అవగాహన సదస్సు
రిపోర్టర్: గోపి
స్థలం: Tirupati
తిరుపతి పట్టణంలోని ఎస్డీహెచ్ఆర్ జూనియర్ కళాశాలలో విద్యార్థుల కోసం మాదకద్రవ్యాల నిర్మూలనపై ఈగల్ అవగాహన కార్యక్రమం నిర్వహించారు. బ్రేక్ ది సైలెన్స్ నినాదంతో డ్రగ్స్ వద్దు బ్రో అనే అంశంపై పోలీసులు విద్యార్థులకు అవగాహన కల్పించారు. నిశ్శబ్దం సమస్యకు పరిష్కారం కాదని, ఎవరికైనా సమాచారం తెలిస్తే 1972 నంబరుకు కాల్ చేయాలని సూచించారు.