స్వచ్ఛ ఉద్యమంతో మారుతున్న రూపురేఖలు: పన్నేండేళ్లుగా చల్లపల్లిలో నిరంతరం శ్రమదానం
రిపోర్టర్: రాము
స్థలం: చల్లపల్లి
గ్రామ పరిశుభ్రతకు పెద్దపీట వేస్తూ వైద్యుడు డాక్టర్ డీఆర్కే ప్రసాద్ సారథ్యంలో చల్లపల్లిలో పన్నేండేళ్లుగా శ్రమదానం కొనసాగుతోందని స్వచ్ఛ సైనికులు తెలిపారు. నిత్యం తెల్లవారుజామునే సుమారు నలభై ఐదు మంది స్వచ్ఛందంగా ముందుకు వచ్చి రోడ్లను శుభ్రం చేయడం, మొక్కలు నాటడం వంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ విశేష కృషి వల్ల గ్రామం జాతీయస్థాయిలో గుర్తింపు పొందడమే కాకుండా పచ్చదనంతో కళకళలాడుతోందని, ఈ నెల ఏడు, ఎనిమిది తేదీల్ లో ద్వాదశ వార్షికోత్సవం నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు వెల్లడించారు.