ప్రొద్దుటూరు చంద్రబాబు సభలో డబ్బులు, మద్యం పంపిణీ: వైఎస్సార్సీపీ తీవ్ర ఆరోపణలు
రిపోర్టర్: ప్రవీణ్
స్థలం: Proddutur
ప్రొద్దుటూరులో నిర్వహించిన చంద్రబాబు సభకు డబ్బులు, మద్యం ఇచ్చి జనాన్ని తరలించారని YSR Congress Party (YSRCP) తీవ్రస్థాయిలో ధ్వజమెత్తింది. మహిళలకు రెండు వందలు, మగవారికి ఐదు వందల రూపాయలతో పాటు మద్యం పంపిణీ చేశారని ఆరోపించింది. బస్సుల్లో అందరూ చూస్తుండగానే టీడీపీ నాయకులు మద్యం పంపిణీ చేశారని మండిపడింది. చంద్రబాబు చెప్పే మాటలు విని చప్పట్లు కొట్టాలంటే ఈ మాత్రం సమర్పించుకోక తప్పదంటూ సోషల్ మీడియా వేదికగా ఘాటు విమర్శలు గుప్పించింది.