రైల్వే కోడూరులో జోరుగా కూటమి అభ్యర్థి రెహమాన్ ఎన్నికల ప్రచారం

రిపోర్టర్: సిటిజెన్ పోస్ట్ స్థలం: రైల్వే కోడూరు

తిరుపతి జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గ కేంద్రంలో కూటమి ఉమ్మడి ఎంపీటీసీ అభ్యర్థి అబ్దుల్ రెహమాన్ షేక్ ఎన్నికల ప్రచారాన్ని ఘనంగా ప్రారంభించారు. నాగుల పుట్ట వద్ద పూజలు నిర్వహించి 15, 16 వార్డులలో పర్యటించారు. ప్రాంతాభివృద్ధి, సంక్షేమమే లక్ష్యంగా ముందుకు సాగుతామని ఆయన తెలిపారు. కూటమి నాయకులు భారీగా పాల్గొని సైకిల్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని ప్రజలను కోరారు.