కాక్‌పిట్‌లో భారతీయ పైలట్‌పై దాడి: భీభత్సకర క్షణాలను గుర్తుచేసుకున్న స్మిత్ మచ్ఛర్
రిపోర్టర్: రాము
స్థలం: Dubai
కాక్‌పిట్‌లో తనపై కో-పైలట్ ఊహించని విధంగా దాడి చేశాడని, ఆ సమయంలో తన రెండేళ్ల కుమారుడే మదిలో మెదిలాడని భారతీయ పైలట్ స్మిత్ మచ్ఛర్ స్కై న్యూస్ అరబిక్ ఇంటర్వ్యూలో వెల్లడించారు. విమానం డైవ్‌లోకి వెళ్తుండగా తలపై వరుసగా బలమైన గాయాలై స్పృహ కోల్పోయే స్థితికి వెళ్లినట్లు ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. తీవ్రమైన గాయాలతో ప్రాణాపాయం నుంచి బయటపడిన ఈ భయానక ఘటన ప్రస్తుతం తీవ్ర కలకలం రేపుతోంది.