కేంద్ర మాధ్యమిక విద్యా మండలి కొత్త అధ్యక్షుడిగా మన్దీప్ కే భండారి

రిపోర్టర్: ప్రవీణ్ స్థలం: New Delhi

కేంద్ర మాధ్యమిక విద్యా మండలి సీబీఎస్ఈ నూతన అధ్యక్షుడిగా మన్దీప్ కే భండారిని కేంద్ర ప్రభుత్వం నియమించింది. విద్యా మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఆయన ఈ బాధ్యతలు చేపట్టనున్నారు. గతంలో జమ్మూ కశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ ప్రధాన కార్యదర్శిగా ఆయన విధులు నిర్వర్తించారు. ఆన్లైన్ మూల్యాంకన వివాదం నేపథ్యంలో సీబీఎస్ఈలో ఏర్పడిన సంక్షోభాన్ని పరిష్కరించి, విద్యా వ్యవస్థపై విద్యార్థులు, తల్లిదండ్రులలో నమ్మకం కలిగించే బాధ్యతను ఆయన చేపట్టనున్నారు.