గరివిడి జడ్పీటీసీ బరిలో ప్రముఖుల కోడళ్లు: రాష్ట్రవ్యాప్తంగా ఉత్కంఠ రేపుతున్న హోరాహోరీ పోరు

రిపోర్టర్: శ్రీనివాస్ స్థలం: విజయనగరం

గరివిడి జడ్పీటీసీ స్థానానికి తెదేపా నుంచి ఎమ్మెల్యే కిమిడి కళా వెంకటరావు కోడలు సంధ్య, వైకాపా నుంచి ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ కోడలు పూజిత నామినేషన్లు దాఖలు చేశారని అధికారులు తెలిపారు. బీసీ మహిళకు రిజర్వు అయిన జడ్పీ ఛైర్మన్ పీఠాన్ని దక్కించుకునేందుకు ఇద్దరు సీనియర్ నాయకులు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారని వారు పేర్కొన్నారు. దీంతో ఈ స్థానంలో సాధారణ ఎన్నికలను తలపించేలా పోరు హోరాహోరీగా సాగుతుండటంతో జిల్లా రాజకీయ వర్గాల్లో తీవ్ర ఆసక్తి నెలకొంది.