రాజంపేట సమస్యల పరిష్కారం కోసం మంత్రి సవితమ్మకు వినతి

రిపోర్టర్: k. siva prasad స్థలం: చిట్వేల్

కడప జిల్లా పర్యటనకు విచ్చేసిన రాష్ట్ర మంత్రి ఎస్. సవితమ్మను టీడీపీ అధికార ప్రతినిధి దొంతం శివప్రసాద్ కలిశారు. రాజంపేట మున్సిపాలిటీ పరిధిలోని పలు సమస్యలపై ఆయన మంత్రికి వినతిపత్రం అందజేశారు. అభివృద్ధి పనుల గురించి చర్చించి త్వరలోనే సమస్యలను పరిష్కరిస్తామని మంత్రి సానుకూల హామీ ఇచ్చినట్లు శివప్రసాద్ తెలిపారు.