కృత్రిమ వర్షాలు కాలుష్యానికి శాశ్వత పరిష్కారం కాదన్న ఐఐటీ కాన్పూర్
రిపోర్టర్: వెంకట్
స్థలం: ఢిల్లీ
కృత్రిమ వర్షాలు లేదా క్లౌడ్ సీడింగ్ అనేది వాయు కాలుష్యానికి శాశ్వత పరిష్కారం కాదని, ఇది అత్యవసర పరిస్థితుల్ లో మాత్రమే వాడే ఒక తాత్కాలిక చర్య అని ఐఐటీ కాన్పూర్ డైరెక్టర్ మనీంద్ర అగర్వాల్ స్పష్టం చేసినట్లు అధికారులు తెలిపారు. ఢిల్లీలో నిర్వహించిన క్లౌడ్ సీడింగ్ ప్రయోగం ఆశించిన ఫలితాలు ఇవ్వలేదని, అసలైన పరిష్కారం కాలుష్య మూలాలను అణచివేయడమేనని నిపుణులు గట్టిగా చెబుతున్నారు.