గుంటూరు నంబూరు మధ్య నాలుగు వరుసల వంతెన నిర్మాణానికి శంకుస్థాపన
రిపోర్టర్: రాము
స్థలం: Andhra Pradesh
గుంటూరు మరియు నంబూరు స్టేషన్ల మధ్య నాలుగు వరుసల రోడ్డు ఓవర్ బ్రిడ్జి నిర్మాణానికి Ministry of Railways ఆధ్వర్యంలో అధికారికంగా శంకుస్థాపన నిర్వహించారు. ఈ కొత్త వంతెన అందుబాటులోకి రావడం ద్వారా రద్దీ ప్రాంతాల్లో ట్రాఫిక్ సమస్య పూర్తిగా తొలగిపోతుందని, రైళ్ల రాకపోకల్లో సమయపాలన మెరుగవుతుందని తెలిపారు. అలాగే ప్రయాణికులు మరియు వాహనదారుల భద్రతను మరింత పెంచేలా ఈ కీలక ప్రాజెక్టును అత్యంత ఆధునిక ప్రమాణాలతో పూర్తి చేయనున్నట్లు రైల్వేశాఖ అధికారులు వెల్లడించారు.