మియాపూర్ భూముల తీర్పు చారిత్రాత్మకం: ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణపై సీఎం రేవంత్ రెడ్డి
రిపోర్టర్: అశోక్
స్థలం: హైదరాబాద్
మియాపూర్ భూముల వ్యవహారంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు చారిత్రాత్మకమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. ప్రభుత్వ ఆస్తులను కాపాడటంలో తమ ప్రభుత్వం ఎట్టిపరిస్థితుల్లోనూ వెనక్కి తగ్గబోదని ఆయన స్పష్టం చేశారు. గత బీఆర్ఎస్ పాలనలో ప్రభుత్వ భూముల విషయంలో తీవ్ర నిర్లక్ష్యం జరిగిందని ఆరోపించారు. గత మూడేళ్ల కాలంలో సుమారు ఒకటిన్నర లక్షల కోట్ల రూపాయల విలువైన భూములను పరిరక్షించామని పేర్కొంటూ, ఈ ఆస్తులను ప్రజల సంక్షేమం కోసమే ఉపయోగిస్తామని వెల్లడించారు.