ధర్మవరంలో అద్భుతమైన మత సామరస్యం చాటిన ముస్లిం దంపతులు
రిపోర్టర్: గోపి
స్థలం: ధర్మవరం, శ్రీసత్యసాయి జిల్లా
శ్రీసత్యసాయి జిల్లా ధర్మవరం పట్టణంలోని పార్థసారథి నగర్ సమీపంలో గణేశుని లడ్డూను ముస్లిం దంపతులు చాందిని, మస్తాన్ వలి రూ.1,45,000లకు వేలంలో దక్కించుకున్నారు. వినాయక ఉత్సవాల్లో భాగంగా నిర్వహించిన ఈ వేలంపాటలో వారు లడ్డూను సొంతం చేసుకోవడం ద్వారా ప్రాంతంలో మత సామరస్యం వెల్లివిరిసింది. ఈ ఘటన స్థానికంగా అందరినీ ఆకట్టుకుని ప్రశంసలు అందుకుంటోంది.