రాప్తాడు ఉన్మాది హేమంత్ కుడి కాలు తొలగింపు: అనంతపురం ఆస్పత్రి సూపరింటెండెంట్ వెల్లడి

రిపోర్టర్: వెంకట్ స్థలం: అనంతపురం

అనంతపురం జిల్లా రాప్తాడు ఘటనలో నిందితుడు హేమంత్ కుడి కాలును మోకాలి పైవరకు తొలగించినట్లు ప్రభుత్వ ఆస్పత్రి సూపరింటెండెంట్ మల్లీశ్వరి తెలిపారు. సోమవారం అర్ధరాత్రి తర్వాత వైద్యులు అతనికి శస్త్రచికిత్స నిర్వహించారని చెప్పారు. పోలీసుల కాల్పుల్ లో గాయపడిన హేమంత్ కు రక్తప్రసరణ నిలిచిపోవడంతో కాలు కుళ్లిపోయిందని వివరించారు. మరోవైపు ఈ ఘటనలో గాయపడిన విద్యార్థిని గోపిక కోలుకుంటోందని, మరో విద్యార్థిని లక్ష్మికి కూడా విజయవంతంగా సర్జరీ పూర్తి చేసినట్లు వెల్లడించారు.