లండన్ వీధుల్లో తిరుగుతున్న మహీంద్రా ఆటో: వీడియో షేర్ చేసిన ఆనంద్ మహీంద్రా

రిపోర్టర్: రాము స్థలం: లండన్

లండన్ నగర వీధుల్లో భారతీయ మహీంద్రా ఆటో రిక్షా తిరుగుతున్న దృశ్యాలు సామాజిక మాధ్యమాలలో వైరల్ అవుతున్నాయి. ఈ వీడియోను పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా తన ఎక్స్ వేదికగా షేర్ చేస్తూ ఆనందం వ్యక్తం చేశారు. ఇది మన ఆటో అంటూ ఆయన గుజరాతీలో రాసుకొచ్చారు. బ్రిటన్ రోడ్లపై ఈ ఆటో చక్కర్లు కొట్టడంపై నెటిజన్లు ఆసక్తికరంగా స్పందిస్తూ రకరకాల కామెంట్లు పెడుతున్నారు. విదేశాలలో మన బ్రాండ్లు కనిపిస్తుండటంపై భారతీయులు గర్వం వ్యక్తం చేస్తున్నారు.