పంచాయతీ ఎన్నికల్లో ఆన్లైన్ నామినేషన్లపై హైకోర్టులో పిటిషన్: నేడు విచారణ
రిపోర్టర్: నరేష్
స్థలం: అమరావతి
పంచాయతీ ఎన్నికల్లో అభ్యర్థులు ఆన్లైన్లో నామినేషన్లు దాఖలు చేసేలా రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని ఆదేశించాలని కోరుతూ హైకోర్టులో పిల్ దాఖలైంది. అభ్యర్థుల వివరాలను ఎస్ఈసీ వెబ్సైట్లో ఉంచాలని కోరుతూ మరొకరు వ్యాజ్యం వేశారు. ఈ పిటిషన్లపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ లిసా గిల్ నేతృత్వంలోని ధర్మాసనం మంగళవారం విచారణ చేపడతామని తెలిపినట్లు న్యాయవాది తాండవ యోగేష్ సోమవారం కోర్టుకు వెల్లడించారు.