ఆసియా క్రీడల్లో జపాన్ కు తొలి స్వర్ణం అందించిన తకుమి హోజో
రిపోర్టర్: రమేష్
స్థలం: Japan
ఐచి నగోయా ఆసియా క్రీడల్లో పురుషుల వ్యక్తిగత ట్రైయాథ్లాన్ లో జపాన్ అథ్లెట్ తకుమి హోజో అద్భుత విజయంతో తొలి స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకున్నారు. ఆదివారం జరిగిన ఈ పోటీలో హోజో 52 నిమిషాల 56 సెకన్లలో లక్ష్యాన్ని చేరుకుని చైనాకు చెందిన ఝాంగ్ జిరుయ్ పై విజయం సాధించారు. కాగా, కజకిస్తాన్ కు చెందిన అర్లాన్ జనాబే కాంస్య పతకం గెలుచుకున్నారు. ఈ విజయంతో హోజో 2028 లాస్ ఏంజిల్స్ ఒలింపిక్స్ కు అర్హత సాధించారు.