భర్తను హత్య చేసి ప్రమానంగా చిత్రీకరించిన భార్య, ప్రియుడు అరెస్ట్

రిపోర్టర్: ప్రసాద్ స్థలం: ఉత్తర ప్రదేశ్

ఉత్తరప్రదేశ్‌లోని సిద్ధార్థ్‌నగర్‌లో సంచలనం సృష్టించిన హత్య కేసును పోలీసులు చేధించారు. వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడనే కక్షతో భర్త హశ్చంద్రను భార్య మాయాదేవి, ప్రియుడు నియాజ్ అహ్మద్ కలిసి దారుణంగా హత్య చేశారు. ఈ హత్యను ఈ-రిక్షా ప్రమాదంగా నమ్మించేందుకు నిందితులు శవాన్ని నదిలో పడేశారు. సుపారీ ఇచ్చి మరీ ఈ హత్య చేయించినట్లు విచారణలో తేలింది. పోలీసులు నలుగురు నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.