సర్దార్ సర్వాయి పాపన్న పోరాట పటిమను యువత ఆదర్శంగా తీసుకోవాలన్న ఎమ్మెల్యే అయిలయ్య
రిపోర్టర్: Alfa News Desk
స్థలం: గుండాల
యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండలం వెల్మజాల గ్రామంలో ఏర్పాటు చేసిన సర్దార్ సర్వాయి పాపన్న విగ్రహాన్ని ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య శనివారం ఘనంగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సర్వాయి పాపన్న త్యాగాలను, బహుజనుల హక్కుల కోసం సాగించిన పోరాట పటిమను నేటి యువత ఆదర్శంగా తీసుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పలువురు స్థానిక నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.