సింగరేణి కార్మికులకు దీపావళి కానుక: ఒక్కో ఉద్యోగికి భారీ బోనస్
రిపోర్టర్: భాస్కర్
స్థలం: తెలంగాణ
సింగరేణి బొగ్గు గని కార్మికులకు దీపావళి పండుగ సందర్భంగా రూ.419 కోట్ల బోనస్ నిధులను నవంబర్ 5న పంపిణీ చేయనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది. ఈ నిర్ణయంతో సుమారు 38 వేల మంది కార్మికులకు ప్రయోజనం చేకూరనుందని, ఒక్కో కార్మికుడికి సగటున రూ.1,10,250 అందనుందని అధికారులు తెలిపారు. నెల రోజుల వ్యవధిలోనే దసరా, దీపావళి బోనస్‌ల రూపంలో ఒక్కో ఉద్యోగికి సగటున రూ.2,65,000 వరకు లభించనుండటంతో కార్మిక కుటుంబాల్లో ఆనందం వెల్లివిరుస్తోందని అధికారులు పేర్కొన్నారు.