ఢిల్లీ విశ్వవిద్యాలయ విద్యార్థి సంఘ ఎన్నికలకు సర్వం సిద్ధం
రిపోర్టర్: సునీల్
స్థలం: ఢిల్లీ
ఢిల్లీ విశ్వవిద్యాలయ విద్యార్థి సంఘ ఎన్నికల పోలింగ్ శుక్రవారం జరగనుంది. ఏబీవీపీ, ఎన్ఎస్ యూఐ, ఎఐఎస్ఏ-ఎస్ఎఫ్ఐ కూటముల మధ్య హోరాహోరీ పోరు నెలకొంది. ఎన్నికల నిర్వహణ కోసం వెయ్యి ఈవీఎంలను సిద్ధం చేశారు. ఉత్తర క్యాంపస్ లోని యూనివర్సిటీ స్పోర్ట్స్ స్టేడియంలో శనివారం ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. ఈ నేపథ్యంలో వర్సిటీ పరిధిలో పటిష్ట భద్రతతో పాటు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.