దాన భూమిని కబ్జా చేసి రియల్టర్ లేఅవుట్
రిపోర్టర్: శివ
స్థలం: నెల్లూరు
నెల్లూరు జిల్లా కొడవలూరు మండలం పెయ్యలపాలెంలో రైతులు దానం చేసిన ఐదు ఎకరాల భూమిలో కొంత భాగాన్ని రియల్టర్ కబ్జా చేసి అనుమతులు లేకుండా ప్లాట్లుగా విక్రయిస్తున్నారు. గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేయగా, తక్షణమే నోటీసులు జారీ చేసి ఆక్రమిత స్థలాన్ని స్వాధీనం చేసుకుంటామని ఇన్ఛార్జి తహసీల్దార్ సాయితేజ స్పష్టం చేశారు.