మంత్రి పొంగులేటి తీరుపై సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర అసహనం
రిపోర్టర్: అశోక్
స్థలం: హైదరాబాద్
రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ప్రసణంపై సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అసెంబ్లీలో 22ఏ భూముల అంశంపై నలుగు గంటల పాటు మాట్లాడినా పసలేదని, సమయం వృథా అయిందని అసంతృప్తి వెళ్లగక్కారు. ప్రభుత్వానికి ఎలాంటి ప్రయోజనం చేకూరకపోవడంతో, ఈ అంశంపై తానే స్వయంగా రంగంలోకి దిగాలని సీఎం నిర్ణయించుకున్నట్టు సమాచారం. దీంతో అసెంబ్లీ సమావేశాలు ఈ నెల 16వ తేదీకి వాయిదా పడ్డాయి.