శ్రీశైలంలో దసరా వేడుకలు: సీఎం చంద్రబాబుకు ఆహ్వాన పత్రిక అందజేత
రిపోర్టర్: రాజేష్
స్థలం: శ్రీశైలం
ప్రముఖ శైవక్షేత్రమైన శ్రీశైలంలో అక్టోబర్ పదకొండు నుంచి ఇరవై వరకు శరన్నవరాత్రి ఉత్సవాలను ఘనంగా నిర్వహించనున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. ఈ మేరకు ధర్మకర్తల మండలి సభ్యులు ఉండవల్లిలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరియు మంత్రి నారా లోకేశ్‌ను కలిసి అధికారికంగా ఆహ్వాన పత్రికను అందజేశారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని, అమ్మవారు తొమ్మిది రోజుల పాటు వివిధ అలంకారాల్లో దర్శనమిస్తారని వారు స్పష్టం చేశారు.