కర్ణాటకలో విద్యార్థులకు 'గ్రామానుభవ' ప్రత్యేక కార్యక్రమం
రిపోర్టర్: గోపి
స్థలం: కర్ణాటక
కర్ణాటక ప్రభుత్వం పట్టణ విద్యార్థుల కోసం సరికొత్త 'గ్రామానుభవ' కార్యక్రమాన్ని ప్రవేశపెట్టింది. దీనిద్వారా రెండు లక్షలకు పైగా విద్యార్థులు వ్యవసాయం, గ్రామీణ జీవనశైలిని ప్రత్యక్షంగా తెలుసుకునేందుకు రెండు రోజుల పాటు గ్రామాల్లో పర్యటించనున్నారు. పాఠ్యపుస్తకాలకు పరిమితం కాకుండా విద్యార్థులకు క్షేత్రస్థాయిలో వ్యవసాయ పద్ధతులు, రైతుల కష్టాలను పరిచయం చేయడమే ఈ కార్యక్రమ ప్రధాన ఉద్దేశం.