డైవర్షన్ రాజకీయాలతో రేవంత్ రెడ్డి పబ్బం గడుపుతున్నారు
రిపోర్టర్: శ్రీనివాస్
స్థలం: తెలంగాణ
నాలుగు వందల ఇరవై హామీల అమలుపై చర్చ జరగకుండా కాంగ్రెస్ ప్రభుత్వం బురద రాజకీయాలకు తెరలేపిందని బీఆర్ఎస్ మండిపడింది. డైవర్షన్ పాలిటిక్స్‌లో పడే ప్రసక్తే లేదని స్పష్టం చేసింది. రేపటి నుంచే ప్రజా సమస్యలపై మళ్లీ పోరాటం ఉధృతం చేస్తామని హెచ్చరించింది. ఎన్ని అక్రమ కేసులు పెట్టినా, కక్ష సాధింపు చర్యలకు పాల్పడినా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని వదిలిపెట్టేది లేదని తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసింది.