ఇండోర్ హైవేపై ఘోరం: అక్రమ మద్యం వాహనం కింద నలిగి ఎస్ హెచ్ ఓ దుర్మరణం

రిపోర్టర్: రాము స్థలం: Dewas

మధ్యప్రదేశ్ లోని దేవాస్ జిల్లా ఇండోర్ బెటుల్ హైవేపై అక్రమ మద్యం రవాణాను అడ్డుకునేందుకు యత్నించిన ఖాటేగావ్ పోలీస్ స్టేషన్ ఇన్-ఛార్జ్ దిలీప్ పూరిని వాహనం ఢీకొనడంతో ఆయన ప్రాణాలు కోల్పోయినట్లు సోమవారం పోలీసులు వెల్లడించారు. ఆదివారం అర్ధరాత్రి జరిగిన ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన ఆయన చికిత్స పొందుతూ మృతి చెందారు. నిందితుడిని అరెస్ట్ చేసి వాహనాన్ని స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. ఈ ఘటనపై కాంగ్రెస్ నేత అరుణ్ యాదవ్ తీవ్రంగా స్పందిస్తూ రాష్ట్రంలో శాంతిభద్రతల లోపంపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు.