యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఖజానాకు పోటెత్తిన పదకొండు లక్షల ఆదాయం

రిపోర్టర్: Alfa News Desk స్థలం: యాదగిరిగుట్ట

యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి నిత్య ఖజానాకు శుక్రవారం రోజున పదకొండు లక్షల యాభై ఐదు వేలన్నూట ఎనభై ఒక రూపాయి ఆదాయం సమకూరినట్లు ఈవో భవానీ శంకర్ తెలిపారు. ప్రధాన బుకింగ్, బ్రేక్, వీఐపీ దర్శనాలు, కార్ పార్కింగ్, ప్రసాద విక్రయాలు, వ్రతాల విభాగాల ద్వారా ఈ మొత్తం భక్తుల నుంచి స్వామివారి హుండీకి మరియు వివిధ సేవల రూపంలో చేరిందని ఆలయ అధికారులు వెల్లడించారు.