నాతవరం జడ్పిటిసి బరిలో వైఎస్సార్సీపీ అభ్యర్థిగా అంకంరెడ్డి సౌమ్య ఘన శపథం

రిపోర్టర్: రుత్తల నాగేశ్వరరావు స్థలం: నాతవరం

అనకాపల్లి జిల్లా నాతవరం మండలం జడ్పిటిసి స్థానానికి అంకంరెడ్డి సౌమ్య అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ఈ సందర్భంగా మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డికి, మాజీ ఎమ్మెల్యే ఉమాశంకర్ గణేష్కు ఆమె ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. పార్టీ తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని, తన తండ్రి ఆశయ సాధన కోసం నిరంతరం శ్రమిస్తానని ఆమె ఈ కార్యక్రమంలో స్పష్టం చేశారు.